Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏకాంతం ప్రాణం మీదకు తెచ్చింది.. అడవిలో యువ జంటపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు!

Solitude turns fatal as high tension wires fall on young couple in forest
Advertisement
  • కదిరి అటవీ ప్రాంతంలో యువ జంటపై విద్యుత్ తీగలు
  • ఏకాంతంగా గడిపేందుకు వెళ్లగా ఊహించని ప్రమాదం
  • యువతి కేకలు విని కాపాడిన గొర్రెల కాపరులు
  • తీవ్రంగా గాయపడిన ఇద్దరూ ఆసుప‌త్రికి తరలింపు
Advertisement
ఏపీలోని కదిరి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బత్తలపల్లి తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతీ యువకుడిపై విద్యుత్ తీగలు తెగిపడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే.. ఫయాజ్ అనే యువకుడు ఓ యువతితో కలిసి ఏకాంతంగా గడిపేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు పైనుంచి విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ షాక్‌కు గురైన యువతి గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో గొర్రెలు మేపుతున్న కాపరులు అప్రమత్తమయ్యారు.

వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గొర్రెల కాపరుల సహాయంతో గాయపడిన యువతి, యువకుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానిక ఆసుప‌త్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.
Advertisement
Advertisement
Fayaz
Kadiri Mandal
High tension wire accident
Battalapalli Thanda
Andhra Pradesh news
Electrocuted couple

More Telugu News